తెలంగాణ రాష్ట్ర వర్షపాతం

Rain in Telangana

తెలంగాణ రాష్ట్రం అర్ధ శుష్క (Semi Arid) రకానికి చెందిన ప్రాంతం. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 906 మి.మీ. రాష్ట్రంలో eighty శాతం వర్షపాతం నైరుతి రుతుపవన కాలంలోనే కురుస్తుంది. మిగిలింది ఈశాన్య రుతుపవనాలు, ఇతర వర్షాల వల్ల కురుస్తుంది.

రాష్ట్రంలో వర్షపాతం
రుతుపవనాలు లభించే సగటు వర్షపాతం (మి.మీ.)
నైరుతి 715
ఈశాన్య 129
ఇతర వర్షాలు 62
మొత్తం 906
2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో అతితక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరం 2004-05 (614 మి.మీ.), అత్యధిక వర్షపాతం నమోదైన సంవత్సరం 2013-14 (1212 మి.మీ.)
1000 మి.మీ. కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం పొందుతున్న జిల్లాలు.. 1) వరంగల్ 2) ఆదిలాబాద్ 3) ఖమ్మం 4) నిజామాబాద్
850 మి.మీ. నుంచి one thousand మి.మీ. మధ్య వార్షిక వర్షపాతం పొందుతున్న జిల్లాలు.. 1) కరీంనగర్ 2) మెదక్ 3) నల్లగొండ
850 మి.మీ. కంటే తక్కువ వార్షిక వర్షపాతం పొందుతున్న జిల్లాలు.. 1) రంగారెడ్డి 2) మహబూబ్‌నగర్

సంవత్సరం

నైరుతి రుతు పవన కాలంలో (మి.మీ.)

ఈశాన్య రుతు పవన కాలంలో (మి.మీ.)

2004-05 487 76
2005-06 820 172
2006-07 734 64
2007-08 737 60
2008-09 755 39
2009-10 506 116
2010-11 903 151
2011-12 608 27
2012-13 713 144
2013-14 852 243
2014-15 495 54
నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాల వల్ల 2013-14లో 852 మి.మీ. వర్షపాతం సంభవించింది. (సాధారణ వర్షపాతం 715 మి.మీ.)
నైరుతి రుతుపవన కాలం: జూన్ – సెప్టెంబర్.
నైరుతి రుతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలు..
1) ఖమ్మం 2) ఆదిలాబాద్
తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలు..
1) మహబూబ్‌నగర్ 2) నల్లగొండ

ఈశాన్య రుతుపవనాలు
ఈశాన్య రుతుపవనాల ద్వారా 2013-14లో 243 మి.మీ. వర్షపాతం నమోదైంది. (సాధారణ వర్షపాతం 129 మి.మీ.).
ఈశాన్య రుతుపవన కాలం: అక్టోబర్ – డిసెంబర్.
ఈశాన్య రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు..
1) ఖమ్మం 2) వరంగల్
అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాలు..
1) ఆదిలాబాద్ 2) మహబూబ్‌నగర్

పంటల సాంద్రత (Crop Intensity)
స్థూల పంట భూమికి, నికర పంట భూమికి మధ్య ఉండే నిష్పత్తిని తెలియజేసేదే పంటల సాంద్రత. వ్యవసాయ రంగ సామర్థ్యాన్ని మదింపు చేసే సూచికల్లో పంటల సాంద్రత ఒకటి.
పంట సాంద్రత = స్థూల పంట భూమి విస్తీర్ణం/నికర పంట భూమి విస్తీర్ణం
సంవత్సరం పంట సాంద్రత
2011-12 1.23
2012-13 1.22
2013-14 1.27
జిల్లాల వారీగా పంట సాంద్రత (2013-14)
జిల్లా పంటల సాంద్రత
మహబూబ్‌నగర్ 1.11
రంగారెడ్డి 1.14
మెదక్ 1.23
నిజామాబాద్ 1.67
ఆదిలాబాద్ 1.09
కరీంనగర్ 1.53
వరంగల్ 1.36
ఖమ్మం 1.16
నల్లగొండ 1.27
తెలంగాణ రాష్ట్రం 1.27
అత్యధిక పంట సాంద్రత ఉన్న జిల్లా నిజామాబాద్ (1.67), అత్యల్ప పంటసాంద్రత ఉన్న జిల్లా ఆదిలాబాద్ (1.09).
రాష్ట్ర సగటు పంటల సాంద్రత కంటే ఎక్కువ పంట సాంద్రత ఉన్న జిల్లాలు..
1) నిజామాబాద్ 2) కరీంనగర్ 3) వరంగల్

నేలలు
తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిపై ఉంది. రాష్ట్రంలో అధిక సారవంతమైన ఒండ్రు నేలలతో పాటు సారంలేని ఇసుక నేలలు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలో నేలలు – శాతాలు
1) ఎర్రనేలలు – forty eight శాతం
2) నల్లరేగడి నేలలు – twenty five శాతం
3) ఒండ్రు నేలలు- twenty శాతం
4) శిలలు, బండరాళ్లు – zero.7 శాతం
నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాలలో నత్రజని లోపం ఉంది. ఇది forty four శాతం కంటే తక్కువగా ఉంది.
ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఫాస్ఫరస్ లోపం (55 శాతం కంటే తక్కువ) ఉంది.
వ్యవసాయ వాతావరణ మండలాలు
వివిధ ప్రాంతాల్లో ఉన్న నేలల రకం, ఉష్ణోగ్రత, వాతావరణం, వర్షపాతం మొదలైన లక్షణాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని four వ్యవసాయ శీతోష్ణస్థితి జోన్లుగా విభజించారు.

ఎరువుల వినియోగం
రాష్ట్రంలో 2014-15లో nineteen.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించారు. కరీంనగర్‌లో తలసరి హెక్టార్‌కు ఎరువుల వినియోగం అత్యధికంగా ఉండగా, మెదక్‌లో అతి తక్కువగా ఉంది.

రాష్ట్రంలో పంటలు

రాష్ట్రంలో ఆహార, ఆహారేతర పంటలను పండిస్తున్నారు.
ఆహార పంటలు
ఆహార పంటల్లో కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఉన్నాయి.
కాయధాన్యాలు: వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న, కొర్రలు లాంటి చిరు ధాన్యాలను కాయ ధాన్యాలు అంటారు.
పప్పు ధాన్యాలు: మాంసకృత్తులను అందించే కందులు, శనగలు, పెసలు, ఉలవలు, మినుములు మొదలైన వాటిని పప్పు ధాన్యాలు అంటారు.
ఆహారేతర పంటలు
ఆహారేతర అవసరాలకు ఉపయోగించే పదార్థాలను ఉత్పత్తి చేసే పంటలను ఆహారేతర పంటలు అంటారు. వీటిని కింది విధంగా విభజించవచ్చు.
1. నార పంటలు: పత్తి, జనపనార లాంటి పంటలను నార పంటలు అంటారు.
2. నూనె పంటలు: వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సోయాబీన్, సన్‌ఫ్లవర్ మొదలైనవి.
3. తోట పంటలు: రబ్బరు, టీ, కాఫీ, మల్బరీ మొదలైనవి.
4. సుగంధద్రవ్యాలు: లవంగాలు, యాలకులు, పసుపు, మిర్చి, మిరియాలు మొదలైనవి.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఆహారేతర పంటల విస్తీర్ణం
సంవత్సరం ఆహారేతర పంటల విస్తీర్ణం (లక్షల హెక్టార్లలో)
2011-12 25.59
2012-13 28.42
2013-14 28.46

ఉద్యానవన పంటలు
తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఆదాయంలో ఉద్యానవన పంటలకు దాదాపుగా five.2 శాతం భాగస్వామ్యం ఉంది. 2013-14లో ten.86 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు పండించారు. వీటిని కింది విధంగా వర్గీకరించవచ్చు.
పండ్లు: తెలంగాణలో ప్రధానంగా అరటి, మామిడి, జామ, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి, సపోటా, బొప్పాయి లాంటి పండ్లు పండిస్తున్నారు. మామిడి, బత్తాయి తోటలను రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.
2013-14 గణాంకాల ప్రకారం..
మొత్తం పండ్ల తోటల విస్తీర్ణం four.26 లక్షల హెక్టార్లు.
మొత్తం పండ్ల ఉత్పత్తి forty six.74 లక్షల మెట్రిక్ టన్నులు.
ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన పండ్ల తోటలు.. 1) మామిడి (2 లక్షల హెక్టార్లు), 2) బత్తాయి (1.39 లక్షల హెక్టార్లు)
ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసిన పండ్లు.. మామిడి (18.05 లక్షల మెట్రిక్ టన్నులు), బత్తాయి (13.90 లక్షల మెట్రిక్ టన్నులు).
కూరగాయలు: రాష్ట్రంలో ప్రధానంగా టమాట, ఉల్లిగడ్డలు, వంకాయ, బెండకాయ, క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, సొరకాయ, కీర పండిస్తున్నారు.
2013-14 గణాంకాల ప్రకారం..
మొత్తం కూరగాయ పంటల విస్తీర్ణం three.47 లక్షల హెక్టార్లు.
మొత్తం కూరగాయల ఉత్పత్తి fifty లక్షల మెట్రిక్ టన్నులు.
ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్న కూరగాయ పంటలు… 1) టమాట 1.59 లక్షల హెక్టార్లు. 2) బెండకాయ zero.43 లక్షల హెక్టార్లు.
ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న కూరగాయలు… టమాట (23.81 లక్షల మెట్రిక్ టన్నులు), ఉల్లిగడ్డలు (7.44 లక్షల మెట్రిక్ టన్నులు).
పూల సాగు: రాష్ట్రంలో చామంతి, మల్లె, గులాబీ, కనకాంబరాలు సాగవుతున్నాయి.
సుగంధ ద్రవ్యాలు: రాష్ట్రంలో మిర్చి, పసుపు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి తదితర సుగంధద్రవ్య పంటలు సాగు చేస్తున్నారు.
ఔషధ, అలంకరణ మొక్కలు: ఉసిరి, అన్నోటా, కొలియస్, లెమన్ గ్రాస్ లాంటి అనేక ఔషధ, అలంకరణ మొక్కలు సాగవుతున్నాయి.
ప్లాంటేషన్ మొక్కలు: కొబ్బరి, ఆలివ్‌పామ్ మొదలైనవి రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్లాంటేషన్ మొక్కలు.

రాష్ట్ర ఉద్యానవన మిషన్ (ఎస్‌హెచ్‌ఎం)
రాష్ట్ర ఉద్యానవన మిషన్ (ఎస్‌హెచ్‌ఎం)ను 2005 నవంబర్‌లో ప్రారంభించారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టే ముఖ్యమైన కార్యక్రమాలు..
1) కొత్త తోటలను నెలకొల్పడం.
2) పూర్వ తోటలను పునరుజ్జీవింప జేయడం.
3) సమీకృత తెగుళ్ల అదుపు (ఐపీఎం)
4) సమీకృత పోషక నిర్వహణ (ఐఎన్‌ఎం)
5) పంటకోత అనంతర నిర్వహణ (పీహెచ్‌ఎం)
6) ఆదాయాలను గణనీయంగా పెంచే విధంగా రైతులకు తగిన శిక్షణ ఇవ్వడం.

వ్యవసాయ వాతావరణ మండలాలు
జోన్

జిల్లాలు

ప్రధాన కేంద్రం

విస్తీర్ణం (చ.కి.మీ.)

మండలాలు

పరిశోధన స్టేషన్లు

ఉత్తర తెలంగాణ జోన్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జగిత్యాల 35.5 144 6
మధ్య తెలంగాణ జోన్ వరంగల్, ఖమ్మం, మెదక్ వరంగల్ 30.6 132 7
దక్షిణ/సదరన్ తెలంగాణ జోన్ మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి పాలెం 39.3 164 6
అధికోన్నతి/గిరిజన ప్రాంతాల జోన్ ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని అధికోన్నతి గిరిజన ప్రాంతాలు చింతపల్లి 4.66 13 3

సంవత్సరం

ఆహార పంటల విస్తీర్ణం (లక్షల హెక్టార్లలో)

ఆహార ధాన్యాల ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)

1955-56 35.35 13.78
1960-61 35.92 19.28
1970-71 42.12 26.75
1980-81 38.71 37.09
1990-91 34.10 48.20
2000-01 33.39 64.63
2001-02 29.64 55.31
2002-03 26.67 39.48
2003-04 29.93 57.99
2004-05 24.97 41.68
2005-06 31.31 75.29
2006-07 30.81 65.21
2007-08 30.09 81.34
2008-09 31.72 82.48
2009-10 26.49 51.9
2010-11 34.44 92.6
2011-12 31.09 75.01
2012-13 28.36 82.42
2013-14 34.54 107.49
2014-15 (ఖరీఫ్) 18.05 44.30

Submit your review
1
2
3
4
5
Submit
     
Cancel

Create your own review

Telangana Results
Average rating:  
 0 reviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *